Posts

Showing posts from July, 2020

Forever Together 💞

Image

ప్రేమతో...నీ...

Image
జీవితం మనకి ఎందరో వ్యక్తులను పరిచయం చేస్తుంది...కానీ ఒక్కరు మాత్రమే చిరకాలం మన మనసులో నిల్చిపోతారు... చెరగని ముద్ర వేస్తారు...మన జీవన విధానం లో వాళ్ళ ప్రభావం అధికంగా ఉంటుంది.. అభిప్రాయాలు, ఇష్టాలు, ఉద్దేశాలు ఒకటవ్వటం తో  వాళ్ళకి ఇంకా చేరువ అవ్తాం,  ప్రేమిస్తాం,అనుకరిస్తాం... మనకంటే ఎక్కువగా వాళ్ళని ఇష్టపడుతూ వాళ్ళలో మనల్ని చూసుకుంటాం...జీవితం లో ఇంతకంటే ఇంకేం అవసరం లేదు అనే అభిప్రాయానికి వస్తాం... నా జీవితం లో ఆ ఒక్కడివి నువ్వు.... ఏదైనా పంచుకోగలను అనే నమ్మకం నువ్వు... ఏ కష్టం వచ్చినా నాకు తోడు ఉన్నావనే ధైర్యం నువ్వు... నా బలం నువ్వు...నా బలహీనత నువ్వు... నా ప్రేమ నువ్వు...నా కోరిక నువ్వు... నా గెలుపు నువ్వు...నా సంతోషం నువ్వు... ఇష్టమైన వాళ్ళతో ఉన్నప్పుడు కాలం చాలా వేగవంతంగా ఉంటుంది. మన ఈ కలయిక లో ఎన్నో మరుపురాని అందమైన అనభూతులు, జ్ఞాపకాలు ఇచ్చావు... నీ ప్రేమని పొందినప్పుడు ఎంత సంతోషించానో నీ కోపాన్ని అనుభవించినప్పుడు రెట్టింపు ఆనందం తో కన్నీళ్లు కార్చాను..."నేను నీ దాన్ని" అనేది నా జీవితంలో కలిగిన గొప్ప అనుభూతి!! తుది లేదు మన ప్రేమకు... మరపు లేదు మన జ్ఞాపకాలకు... శాశ్వతమవ్వ...