చిరునవ్వుల చిరునామా❤️
ఒక వైపు కుటుంబ బాధ్యత, మరో వైపు వృత్తి పరంగా పురోగతి సాధించే కార్యాచరణ పై సందిగ్ధత!!వీటని భరిస్తూ తన సన్నిహితుల తో మంచి చెడులు పంచుకుంటూ, మనసుకి నచ్చిన వ్యక్తి కోసం తపిస్తూ...గుండె నిబ్బరం తో ఇతరులను బాధించకుండా తనలో తానే మధన పడుతూ తన వాళ్ళకి సంతోషాలు మాత్రమే పంచుతూ, కష్టాల కడలి లో తాను ఈదుతూ,జీవితాంతం "నా" అనే మాట మరిచి "మన" అనే మాట కోసమే బ్రతుకుతూ తన యవ్వనాన్ని బుద్బుధ ప్రాయంగా గడిపిన, గడుపుతున్న ప్రతి ఒక్కరు పురుషోత్తములే🙏🏼 ఈ గుర్తింపు ఆశించని త్యాగం వెలకట్టలేని ఎన్నో మధుర జ్ఞాపకాలకు, చిరునవ్వుల చిరు జల్లులకు చిరునామా❤️