Posts

Showing posts from March, 2021

ఏడు వసంతాల ప్రస్థానం ❤️

Image
 ఒక్కడిగా వచ్చాడు... ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు... కానీ ఆ ధైర్యం చెదరలేదు... ప్రజాసేవ అనే ఉద్దేశంతో వచ్చిన ఆయన సంకల్పం గొప్పది... ఓటమి వలన నిరాశ చెందలేదు... మొండిగా ప్రజల పక్షాన నిలబడి ఏడు సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు.. అనుభవం ఉన్న రాజకీయ నాయకులు లేరు... కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చి పార్టీని నడిపే వ్యాపారవేత్తలు లేరు.. కేవలం అభిమానులైన యువత మాత్రమే!!  సినిమా అభిమానులు రాజకీయంలో ఏం నిలబడగలరు అని హేళన చేశారు..ఆ యువతే ఈ రోజు కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీల్లో కూడా వణుకు పుట్టిస్తున్నారు... ప్రజల్లో అవగాహన కలిగి ఏళ్ల తరబడి ఉన్న వ్యవస్థ మార్పు చెందటం అంత సులభతరం కాదు.. కానీ ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదు.. ఒక్కడితో మొదలైన ఈ జనసేన నేడు ప్రతి సామాన్యుడి సేన గా మారి సార్ధక నామధేయం గా నిలిచింది ఈ ఏడు సంవత్సరాలుగా రాజకీయం అంటే డబ్బు మాత్రమే కాదని నిరూపించి ఎందరో యువతలో సామాజిక సేవా భావాలని పెంపొందించి ఆదర్శంగా నిలిచినందుకు కృతజ్ఞతలు.. ఇదే స్ఫూర్తితో దినదినాభివృద్ధి చెందాలని ఆశిస్తూ జనసేన ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు